తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం
తిరుపతి టౌన్
టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఆదివారం
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరైనారు.ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించారు. పార్టీ బలోపేతం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, అభివృద్ధి దిశలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశాలు స్వీకరించారు.అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ ఆశయాలకు కట్టుబడి ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ప్రజాసేవే ధ్యేయంగా ఏర్పడిన తెలుగు దేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, టిడిపి సీనియర్ నేతలు మబ్బు దేవ నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాయలసీమ టిడిపి మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రమణ్యం, మాజీ కార్పొరేటర్ అన్న అనిత యాదవ్, బుల్లెట్ రమణ, పుష్పావతి యాదవ్, సూర సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు
