లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…
ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు
తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గుడ్ ఫ్రైడే సెలవు ప్లస్ వీకెండ్ కలిసి రావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంటులు నిండిపోయి..
శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా దర్శనాలు కొనసాగుతున్నాయి.తిరుమల ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయడంతో దర్శన ప్రక్రియ సాఫీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
టైమ్ స్లాట్ ఎస్ఎస్ డి దర్శనానికి 7 గంటలు, రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. మరో వైపు శుక్రవారం ఏప్రిల్ 3  తిరుమల శ్రీవారిని 68 వేల 445 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31 వేల 383 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు