శివయ్య సేవలో ప్రముఖులు
శ్రీకాళహస్తి
స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ, టీటీడీ బోర్డు సభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి
వీరిలో ఉన్నారు. వీరికి ఆలయ ఈవో సాంప్రదాయ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద వేదపండితులు ఆశీర్వచనాలు పలికగా, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ముక్కంటి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.
