ముక్కంటిని దర్శించిన కొడాలి నాని
శ్రీకాళహస్తి
స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం విచ్చేశారు. వీరికి మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్ ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను అంతరాలయ దర్శనం చేసుకున్నారు. తదనంతరం గురుదక్షిణమూర్తి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు పలికి ముక్కంటి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.
