ముఖ్యమంత్రి పర్యటనలకు సర్వసిద్ధం
నేడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పి _4 కార్యక్రమంలో
పాల్గొనునున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
:జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి టౌన్
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పై ఆదివారం జిల్లా కలెక్టర్ తో పాటు అర్బన్ ఎస్పి సుబ్బరాయుడు సమీక్షించారు. మార్చి 30న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పి _4 కార్యక్రమంలో పాల్గొనునున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య లతో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. అనంతరం మార్చి 30న నాయుడుపేట పుదూరు గ్రామం నందు టిడ్కో గృహాలను ప్రారంభోత్సవo చేయనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావుల తో కలసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పై నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో ఏ ఎస్ ఎల్ లో (మందస్తు భద్రత లైజన్) భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, అడిషనల్ ఎస్.పి రవి మనోహారాచారి, సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేంద్ర రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 30 న నాయుడుపేట పుదూరు గ్రామం నందు టిడ్కో గృహాలను ప్రారంభోత్సవo, గృహప్రవేశం చేయనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి నాయుడుపేట నెల్లబల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడ నుంచి టిడ్కో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలన అనంతరం సభా వేదికకు చేరుకుంటారని తెలిపారు. ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అగ్నిమాపక వాహనమును అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు వైద్య బృందం, అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమం జరుగు అన్ని ప్రదేశాలలో పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.. పర్యటన ఏర్పాటు లలో విధులు కేటాయించిన అధికారులు ఆలస్యం లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ హెలిప్యాడ్ వద్ద పోలీస్ బందోబస్తు పక్కగా ఉండాలని తెలిపారు. హెలిప్యాడ్ నుండి సభ వేదిక వెళ్ళు వరకు మందస్తు భద్రత ఉండేలా చూసుకోవాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడ్కో అధికారులు, జిల్లా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
