తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీతారలు
తిరుమల
తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో సినీ నటి జాన్వీ కపూర్, నటి మహేశ్వరి, సినీ నటి రుక్మిణి వసంత్ వున్నారు.వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసి రంగనాయక మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నటీమణులతో సెల్ఫీల కోసం పలువురు భక్తులు పోటీపడ్డారు.
