తిరుమలలో దివ్వెల మాధురి,తనుజ ఓవరెక్షన్ పై కేసునమోదు

తిరుమలలో దివ్వెల మాధురి,తనుజ ఓవరెక్షన్ పై కేసునమోదు
తిరుమల
తిరుమల కొండపై చేస్తున్న వింత చేష్టల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం లైక్స్ వ్యూస్ పెంచుకోవడం కోసం లేదంటే సోషల్ మీడియా వార్తల్లో నిలవడం కోసం తిరుమల కొండపై నిషేధం అయినటువంటి చర్యలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న గీతు రాయల్ రీల్స్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే బిగ్ బాస్ తనూజ, దివ్వెల మాధురి సైతం వివాదంలో నిలిచారు. తనూజ పుట్టిన రోజు సందర్భంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఈమె తిరుమల వెళ్లారు.
తిరుమల వివాదం తనూజకు షాక్..
ఇలా స్వామివారి దర్శనం అనంతరం మాధురి తిరుమల కొండపై గెస్ట్ హౌస్ లో తనూజ బర్తడే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తిరుమల కొండపైకి కేక్ తీసుకు వెళ్లడం నిషేధం అయినప్పటికీ ఈమె కేక్ తీసుకెళ్లి తన చేత కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు .అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో సంచలనగా మారటమే కాకుండా వీరిద్దరూ వివాదంలో చిక్కుకున్నారు. మాధురి తనూజ తిరుమల నిబంధనలను ఉల్లంగించారని, కచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్యలకు ఆదేశించిన టిటిడి..
ఇలా భక్తుల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తనూజ మాధురిపై చర్యలకు సిద్ధమయ్యారు. తిరుమల నిబంధనలను అతిక్రమించడంతో తనూజ, మాధురి పై చర్యలు తీసుకోవాలి అంటూ టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ విషయంపై టిటిడి స్పందించడంతో వీరిద్దరూ చిక్కుల్లో పడ్డారని చెప్పాలి మరి తనూజ, మాధురి ఈ ఘటనపై స్పందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో క్షమాపణలు చెప్పిన మాధురి..
ఇలా మాధురి తనూజ గురించి ఈ విధమైనటువంటి వివాదం చెలరేగినప్పటికీ వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే మాధురి తిరుమల వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఈమె ఇలాంటి వివాదంలో నిలిచారు ఆలయం ముందు రీల్స్ చేయటంతో అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఇక ఈ విషయంపై మాధురి స్పందించి గతంలో క్షమాపణలు తెలియజేశారు. ఇలా ఒకసారి తిరుమల విషయంలో వివాదంలో నిలిచి క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్లీ కూడా మాధురి తిరుమల నిబంధనలను అతిక్రమించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి గురించి కేసు నమోదు కావడంతో ఇప్పటికైనా ఈ ఘటనపై స్పందిస్తూ తనూజ మాధురి వివరణ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు