స్వర్ణంద్ర సాదనే లక్ష్యం గా చంద్రబాబు నాయుడి పాలన..సతీమణి నారా భువనేశ్వరి

స్వర్ణంద్ర సాదనే లక్ష్యం గా చంద్రబాబు నాయుడి పాలన..!

రామకుప్పం :స్వ ర్నాంద్ర, స్వర్ణ కుప్పం లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని సి ఏం సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ నాలుగు రోజుల  పర్యటన లో భాగంగా గురువారం ఆమె రామకుప్పం మండలం లో పర్యటించారు. ఈ సందర్బంగా రామకుప్పం, మనేంద్రం గ్రామాల్లో దివంగత సి ఎం యన్టీఆర్ విగ్రహాలను పూలమాలలు వేసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆమెకు టిడిపి నేతలు, కార్యకర్తలు ఘజమాలతో స్వాగతం పలికారు. రామకుప్పం లోని కాశీవిశ్వేశ్వరాలయంలో
ఆమె ప్రత్యేక పూజలు చేపట్టారు. రామకుప్పం  భహిరంగ సభలో, బల్ల గ్రామంలో మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

 పేదల పెన్నిది ఎన్టీఆర్ . రూ. 2 కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని, ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు  .
పేదల ఆకలి తీర్చేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తు,పేదల సొంతింటి కల నెరవేరుస్తు, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారు .
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం చంద్రబాబు  సమర్థ నాయకత్వానికి నిదర్శనం గా పేర్కొంటూ  విశాఖలో  గూగుల్ డేటా సెంటర్ , అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్నాయన్నారు.
చంద్రబాబు ని 8  సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు తమ కుటుంభం   రుణపడి ఉంతుందని,కుప్పానికి పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఆర్థిక సాయం చేస్తు,దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తు,
పేదలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు సంజీవని ప్రాజెక్టు తెచ్చిన ఘనత టిడిపి దే నన్నారు.
ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు,డ్వాక్రా స్థాపించి మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి, హంద్రీ నీవా జలాలు కుప్పనికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు దే అన్నారు.
కుప్పంలో ఎలీప్ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని,
చంద్రబాబుకు  ప్రజలే ముఖ్యం, సాయం కోసం వచ్చిన వారు ఏ పార్టీ అని ఆయన ఆలోచించరని, ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసునని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆమె వెంట ఏపీ ఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్, ఉడా చైర్మన్ సురేష్ బాబు, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు