ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : కమిషనర్ పి నరసింహ ప్రసాద్
చిత్తూరు అర్బన్ : నగరంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం కమిషనర్ పి నరసింహ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, నగరపాలక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి చర్చి వీధి, ఓటీకే రోడ్డు, సుందరయ్య వీధి ఎక్స్టెన్షన్ లో పర్యటించారు. ఆసుపత్రులు, మార్కెట్, ఇతర వాణిజ్య సముదాయాలు దృష్ట్యా చర్చి వీధిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని.. ట్రాఫిక్ నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి పరిశీలించి చర్చించారు. ప్రధానంగా ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగించడం, ఫుట్ పాత్ ను విస్తరించి.. పార్కింగ్ కు అనుకూలంగా మార్పు చేయడం వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ పాత్ లలో ఆక్రమణలు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సుందరయ్య వీధి యాక్షన్ లో స్థానిక కస్తూరిబా పాఠశాల వద్ద రోడ్డుపై ఆక్రమించి నిర్మించిన దుకాణాలను తొలగించాలన్నారు. ఓటీకే రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంఈ వెంకటరామి రెడ్డి, ఎంహెచ్వో డా. లోకేష్,ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
