ప్రజల అప్రమంతంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచన
రామకుప్పం:మండలంలోని ననియాల అటవీ సమీప ప్రాంతంలో జంట ఏనుగులు రాత్రి సమయాల్లో సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి జంట ఏనుగులు ననియాల పరిసర ప్రాంతాల్లో సంచరించి అడవిలోని సుద్దుకుంట ప్రాంతంలో త్రిష్ట వేశాయి. శుక్రవారం రాత్రి రామాపురం తాండా, ననియాల తాండా, నారాయణపురం తండా, జీడిమాకులపల్లి, ఎస్ గొల్లపల్లి, పంద్యాల మడుగు గ్రామాల వైపు జంట ఏనుగులు సంచరించే అవకాశం ఉందన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉంది రాత్రి సమయంలో ఒంటరిగా వంట పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. పొలాల వద్ద విద్యుత్ తీగలు తగిలేనంత ఎత్తులో ఉంటే వాటిని తొలగించాలన్నారు. జంట ఏనుగులు గ్రామాల వైపు సంచరిస్తే 89196 68651,6301667521 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా జీడిమాకులపల్లిలో అటవీ సంరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవి ప్రాంతాన్ని పచ్చని చెట్లను కాపాడుకోవాలని తద్వారా మంచి ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని వివరించారు. అటవీ అధికారులకు సహకరించి ఎవ్వరు అటవీ ప్రాంతంలో నిప్పు అంటించవద్దని కోరారు.
