శ్రీనివాసమంగాపురం బ్రిడ్జి వద్ద తాత్కాలిక మరమత్తులు
చంద్రగిరి మండలంలోని చంద్రగిరి- శ్రీనివాసమంగాపురం మార్గంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద మరమత్తులకు గురైన రోడ్డును తాత్కాలికంగా మరమత్తులు చేపట్టారు. శ్రీనివాసమంగాపురం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద మురుగు నీరుతో కొన్ని నెలలు వాహనదారులు, ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈసమస్య మురుగు నీరు తొక్కాల్సిందే శీర్షిక వెలువడింది. అయితే ఎట్టకేలకు ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్డును తాత్కాలికంగా మరమత్తులు చేపట్టారు. దీంతో వాహనదారులు, భక్తులు, ప్రజలు ఎమ్మెల్యే నానికి కృతజ్ఞతలు తెలిపారు.
