పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం

పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం

క్యాంపస్ :

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా తిరుమల నారాయణమ్మ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ అధ్యాపకులు చెప్పే పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్చుకున్నామన్నారు. పూర్వ విద్యార్థినులు సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. ఈ కళాశాల స్నేహబంధాలకు పెట్టింది పేరు అని తెలిపారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు సినీ, రాజకీయ రంగాల్లోనూ టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తున్నారని వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి ఆచార్యులు కుసుమ కుమారి, హోమ్ సైన్స్ విభాగం, ఎస్ వి యూనివర్సిటీ, తిరుపతి విచ్చేసి ఈ కళాశాలలో చదువుకోవడం వల్ల విలువల్ని, క్రమశిక్షణను కష్టపడే గుణాన్ని నేర్చుకున్నామని తెలిపారు. విద్యార్థినిలు మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్నారు, కమ్యూనికేషన్ స్కిల్ ను డెవలప్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా అపర్ణాదేవి, లాయర్, హైకోర్టు, చెన్నై వారు విచ్చేసి జ్ఞాన సమపార్జనకు అధ్యాపకులు చెప్పే పాఠాలతో పాటు లైబ్రరీకి వెళ్లి పుస్తక పఠనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిపారు. మరొక అతిథి ఎం.ఎస్ లక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ విద్య ఆత్మస్థైర్యాన్నిస్తుందని, రేపు చేయాలనుకునే పనిని ముందు రోజే పూర్తి చేయడం నేర్చుకోవాలని తెలిపారు. మరొక అతిథి ఎం. సుభాషిని మాట్లాడుతూ హార్డ్ వర్క్, డిస్ప్లేన్, సిన్సియారిటీని కలిగి ఉన్నప్పుడు ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చునని తెలిపారు. మరొక అతిథి శ్రీమతి తస్లీమా సుల్తాన్, డైరెక్టర్, అభయ క్షేత్రం, రేణిగుంట వారు విచ్చేసి విద్యార్థినులందరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదని వారిని ప్రేమగా, భద్రతగా, బాధ్యతగా చూసుకోవాలని తెలిపారు. పూర్వ విద్యార్థినుల సంఘం అధ్యక్షులు డా. కె. వసుధ అల్మిని మీట్ ని గురించి, అసోసియేషన్ విధి విధానాలను, చేపట్టిన కార్యక్రమాలను గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ డా విద్యుల్లత, ట్రెజరర్ డా ఉమాదేవి, వైస్ ప్రెసిడెంట్ డా భువనేశ్వరి దేవి, సుజాలలిత, డా వై శిరీష, ఎం సరస్వతి, డా వై సునీత, డా బి లక్ష్మీ, ఇందిరా, డా నిగార్ సుల్తానా, పి.ఆర్ భారతి, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు