అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ గ్యాస్ గోదాముపై తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం చేశారు. అక్కడ నిలవంచిన కమర్షియల్, డొమెస్టిక్, ఐదుకిలోల గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాము గుండా చెన్నై నుంచి తీసుకొచ్చిన 5 కిలోల సిలిండర్లలో గ్యాస్ ను నింపి వలస కార్మికులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోదాము నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఈ గ్యాస్ గోదాము నిర్వాహకులపై కేసు నమోదైంది.
