నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు :మార్చి నెల 16 వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయ 16.3.2026 వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.
