దుష్టబుద్ధి!

దుష్టబుద్ధి!
చైతన్య పురిని చైతన్యుడు పాలించేవాడు.  పక్కనే గోవర్థనగిరి రాజ్యం వుంది.  గోవర్థనగిరిని గోపాలుడు పాలించేవాడు.
చైతన్యపురంలో ఎక్కువగా పశువైద్యులు వున్నారు. గోవర్థనగిరిలో  పాడి ఆవులు కలిగిన రైతులు వున్నారు.  అందుచేత రెండు దేశాల మధ్య  పరస్పర సహాయ సహకారాలు  వుండేవి.
చైతన్యపురం పశువైద్యులు అందించే వైద్యం వల్ల గోవర్థనగిరిలో పశువుల ఆరోగ్యంగా వుంటూ అధిక పాలు ఇచ్చేవి. రైతులు బాగా డబ్బు సంపాదించి  సంపన్నులు కాసాగారు.   ఆ దేశం చూస్తున్నంతలో  సంపన్న దేశంగా మారింది.  ఇది చైతన్యుడికి మింగుడు పడలేదు. కళ్లెదుటే తనకు మించి ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఓర్చుకోలేకపోయాడు .
మరుసటి రోజే తన మంత్రి మండలిని సమావేశ పరిచాడు.  పశువైద్యులను రప్పించి ‘‘ మన దేశం అభివృద్ధికి ఆమడదూరంలో వుంది. మీ వైద్యం వల్ల గోవర్థనగిరిలో పాడి పశువులు బాగా అభివృద్ధి చెంది మనకంటే వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.. అది ఎంతమాత్రం తగదు.. వెంటనే ఏదో ఒక ఉపాయంతో వారి అభివృద్ధిని నిరోధిచండి.. లేదంటే దేశ బహిష్కరణ తప్పదు.. !’’ అని హెచ్చరించాడు.
రాజు ఆదేశంతో పశువైద్యులకు దిక్కుతోచలేదు.  అయోమయంలో పడ్డారు. అందరూ సమావేశమై ‘‘ సరే(( అని తలలు ఊపారు.
ఆ మరుసటి వారం గోవర్థనగిరి పశువులకు పాలు తగ్గేలా ఓ మందు ఇచ్చారు పశువైద్యులు.
రెండు రోజులకే  పాడి పశువుల పాలు తగ్గించి తీవ్ర జబ్బుతో తల్లడిల్లి మృత్యువాత పడ్డాయి.   రాజ్యంలో వున్న ఆవులన్నింటిదీ ఇదే పరిస్థితి ఎదురైంది.
ఇది గమనిస్తున్న గోవర్థనగిరి రాజు గోపాలుడుకి పశువైద్యులపై అనుమానం కలిగింది.  వెంటనే తమ రాజ్యాంలో వైద్యం చేస్తున్న పశువైద్యు పశువైద్యులను పిలిచి ‘‘ ఏమిటీ ఈ పరిస్థితికి మీలో కుట్ర దాగి వుంది..’’ అని  గద్దించాడు.  విచారణ చేసి నిజమని తేలితే కఠిన శిక్ష వుంటుంది..’’ అని హెచ్చరించాడు.
ఆ తర్వాత రాజు చేసిన విచారణ పశువైద్యుల కుట్ర ఫలితంగా నే తమ దేశ పశువులు చనిపోయాయని తేలింది. ఆ తర్వాత గోవర్థనగిరి ప్రజలు చైతన్యపురి చైతన్యపురం దేశ పశు వైద్యులకు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. కొందరికి రాజు చెరసాలలో జీవితఖైదీ శిక్ష విధించాడు.
ఈ చర్యతో చైతన్యపురం దేశ పశువైద్యులకు అపఖ్యాతి లభించింది.  ఉపాధి కోల్పోయి  జీవితం  దుర్భరమైంది.  రాజు మాటలు విన్నందుకు తగిన శిక్ష అనుభవించారు.
అదేమీ పట్టని చైతన్యపురం రాజు ఇక తనదేశం ఆర్థికంగా దూసుకుపోతుందని కట్టడి చేశానని ఎగిరి గంతేశాడు.
కాని అప్పటికే రాజు దుష్టబుద్ధిని గ్రహించిన ప్రజలు మరో దేశానికి వలసలు వెళ్లి హాయిగా జీవించారు.
చైతన్యపురి రాజు చైతన్యుడి దుష్ట బుద్ధిని గ్రహించిన గోపాలపురం రాజు గోపాలుడు నవ్వుకుని తన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితే పోటీ పడాలి తప్ప  ఇలా అక్రమ మార్గంలో దెబ్బతీసి సొంత ప్రజలకు దూరమై ఏకాకిగా మిగిలి  ఫలితం అనుభవిస్తున్నాడని  గ్రహించాడు.  తర్వాత చెరసాలలో శిక్ష అనుభవిస్తున్న పశు వైద్యులను విడిపించి తనదేశంలో  పశు వైద్యానికి అనుమతించి ఉపాధి కల్పించాడు.  చైతన్యపురి వలస ప్రజలను అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాడు.
ఇప్పుడు గోవర్థన గిరి రాజు గోవర్థునుడి మంచి మనసుకు ప్రజలు కష్టించి చేయూత అందించారు. అనతి కాలంలోనే గోవర్థనగిరి ఆర్థికాభివృద్ధి శరవేగంగా దూసుకుపోయింది. చైతన్య పురి రాజు చైతన్యుడి దుష్ట బుద్ధి ఫలితంగా ఆ దేశం పతనమైంది. తనకు తానే ఫలితం అనుభవించసాగాడు.
– బోగా పురుషోత్తం, తుంబూరు. 

Previous article
Next article

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు