పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించిన భువనేశ్వరి 

పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించిన భువనేశ్వరి

కుప్పం : కుప్పం డాక్టర్ వై.సి. జేమ్స్ యేన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు. పలువురు విద్యార్థులు సాంకేతిక విభాగాల్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్న హరీష్ దక్షిణ భారత దేశ స్థాయి పాలిటెక్నిక్ విద్యార్థుల చదరంగం పోటీలలో విజేతగా నిలిచాడు. ఎలక్ట్రికల్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్న శివశంకర్ గుజరాత్‌లో జరిగిన ‘ఇండియన్ ఇన్నోవేషన్’ పోటీలలో బంగారు పతకం సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాలిటెక్నిక్ విద్యార్థులను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి అభినందిస్తూ సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామకృష్ణ, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ హెచ్వోడీలు మల్లప రాజు , శ్రీనివాసులు, డా. సయ్యద్ హు సేన్ మెయిన్, నాగరత్న, ఫిజికల్ డైరెక్టర్, పీడీ ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, ఏవో చెన్నారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు