నిజమైన బహుమతి!

నిజమైన బహుమతి!
చిన్నసూరి పెద్ద కవి. తన కవితలు వినిపిస్తూ రాజు చిన్మయానంద వద్ద చిన్నచిన్న బహుమతులు పొందేవాడు.
ఆ బహుమతులతో చిన్నయసూరి  ఆనందించి ఇంటికెళ్లేవాడు.
తనకు వస్తున్న బహుమతులతో ఇల్లు గడిచేది కాదు. ఇంట్లో పిల్లలు, వారి చదువులు, తినేందుకు తిండి ఖర్చులకు సరిపోయేది కాదు.  దీంతో చిన్నయసూరి కడు పేదరికం అనుభవించేవాడు.
తన పేదరికం ఎలా వున్నా  సమాజంలో కనిపిస్తున్న పేద, ధనిక వ్యత్యాసాన్ని చూసి బాధపడేవాడు. వారందరినీ పేదరికం నుంచి బయట పడేయాలని పరితపించేవాడు. రాజు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలనుకున్నాడు.
ఓ రోజు రాజు వద్ద మంచి కవితలు వినిపించాడు. రాజు అది వింటుంటే విసుక్కున్నాడు. ‘‘ ఏమయ్యా కవి.. నా పాలనలో  ఎంతో గొప్పగా వుందని, పేదరికం లేదని రోజూ పొగడ్తలతో  కవితలు వినిపిస్తుంటే ఉప్పొంగిపోయేవాడిని.. ప్రజలు అంతా బాగున్నారని సంతోషించేవాడిని మరి ఒక్కరోజులోనే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందయ్యా? అయినా కవితలు రాజును పొగిడేలా వుండాలి.. అప్పుడే నువ్వు వృద్ధిలోకి వస్తావు.. బాగుపడతావు..’’ అని హెచ్చరించాడు రాజు.
చిన్నయసూరి పేదరికాన్ని తలుచుకుంటూ రాజు అసమర్థ పాలనను కవితలతో విమర్శించాడు.
అది గ్రహించలేని రాజు కాలిలో ముల్లు గుచ్చుకుని విలవిలాడిపోయే వాడిలా  తన మంచి పాలనకు అడ్డకుంలేమిటి?  అసలు తను ఇచ్చే బహుమతులు చిన్నయసూరికి నచ్చనట్లుంది? అందుకే తన సుపరిపాలనకు తూట్లు పొడుస్తున్నాడు. ’ అనుకున్నాడు. అప్పటికే తీవ్ర ఆవేదనతో ఇంటికెళ్లిన చిన్నయసూర్తి వద్దకు స్వయంగా వెళ్లాడు రాజు చిన్మయానంద.
పూర్తి గుడిసెలో కూర్చున్న చిన్నయసూరిని బయటకు రమ్మని పిలిచాడు.  అది విని చిన్నయసూరి పిల్లలు బయటకు వచ్చి చూశారు.   చిరిగిన దుస్తులు వేసుకున్న వారి ముఖంలో అశాంతి, ఆవేదన కనిపిస్తోంది.
‘‘ ఏమయ్యా కవి.. మా బహుమతి స్వీకరించి మమ్ము ఆనందింపచేయి..’’ అని గద్ధించాడు రాజు.
లోపలి నుంచి చింపిరి దుస్తులతో బయటకు వచ్చిన కవి భార్యను చూసి ఆశ్చర్యపోయాడు రాజు.
‘‘ ప్రభూ పేదరికంలో నేనే కాదు..ఈ రాజ్యం అంతా కడు పేదరికంలో వుంది. వారికి కడుపు నిండా తిండి తినే సౌకర్యం కల్పించండి..’’ సమాజంలో ప్రజల కష్టాలు పరిష్కరించడమే నా లక్ష్యం.. అందుకే కవిత్వం నేర్చుకున్నాను.  ప్రజలు పస్తులు లేకుండా హాయిగా జీవించినప్పుడే నాకు మనశాంతి లభిస్తుంది.. అప్పుడు మీరిచ్చే బహుమతికి సార్థకత చేకూరుతుంది. ’’ అని తిరస్కరించాడు.
అది చూసిన రాజు చిన్మయానందకు కళ్లు తెరిపించినట్లైంది. ఇన్నాళ్లు ప్రజల కష్టాలు పట్టించుకోని రాజు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లాడు. వారి పడుతున్న కష్టాలు స్వయంగా చూశాడు.  అర్హతను పరిశీలించి రాజ ఆస్థానంలో ఉద్యోగాలు ఇప్పించాడు. కొందరికి రాజ్యంలో మంచి పొలాలు ఇప్పించాడు. పేదరికంలో వున్న ప్రజలకు పనులు దొరకడంతో ఆదాయం వచ్చి జీవనం మెరుగుపడిరది. దీన్ని గమనించి చిన్నయసూరి రాజును తన కవితలతో పొగిడాడు. అది విన్న రాజు  మంచి బంగారు కడియాలు బహుమతిగా ఇచ్చాడు.  అది సున్నితంగా తిరస్కరించాడు కవి చిన్నయసూరి ’’ చేతులు జోడిరచి ప్రభూ మీ అభిమానానికి కృతజ్ఞతలు..ధనం అధికంగా వుండకూడదు.. అది మనిషిని అత్యాశకు గురి చేసి అహం పెంచుతుంది..అప్పడు నిజం గ్రహించలేము..ప్రజల కష్టాలు తెలుసుకోలేము’’ అనడంతో రాజు కవి మనసులోని అంతరార్థం గ్రహించాడు.   వున్న వాడు, లేని వాడి మధ్య వున్న సంపదల తేడాను రూపు మాపేందుకు నడుం కట్టాడు.
అది చూసిన కవి చిన్నయసూరి ‘‘రాజును ప్రశంసించి ఇదే నాకు మీరిచ్చిన నిజమైన బహుమతి’’ అని కృతజ్ఞతలు తెలుకున్నాడు.
` బోగా పురుషోత్తం, తుంబూరు, తిరుపతి జిల్లా.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు