తిరుపతి చిత్తూర్ కార్పొరేషన్ల డివిజన్లో పెంపు తిరుపతి కార్పొరేషన్ 50 నుంచి 66 చిత్తూరు కార్పొరేషన్ 50 నుంచి 60 డివిజన్లు పెయింట్స్ ఉత్తర్వులు

తిరుపతి చిత్తూర్ కార్పొరేషన్ల డివిజన్లో పెంపు
తిరుపతి కార్పొరేషన్ 50 నుంచి 66
చిత్తూరు కార్పొరేషన్ 50 నుంచి 60
డివిజన్లు పెయింట్స్ ఉత్తర్వులు
తిరుపతి టౌన్
రాష్ట్ర ప్రభుత్వం పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు డివిజన్లు పెంచుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టాలు (1955, 1979, 1994) మరియు 2005 నియమాలు, తదితర సవరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన కమిషనర్‌కు ఇచ్చిన అధికారాల మేరకు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికైన సభ్యుల (వార్డు సభ్యులు) సంఖ్యను నిర్ణయిస్తున్నట్లు ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లో కాను 66 డివిజన్లు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతోపాటు పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లో ఉంటే 60 డివిజన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో డివిజన్ల సంఖ్య పెరగడం వల్ల చాలామంది రాజకీయ నేతలకు మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువమందికి కలుగుతాయి. ఇప్పటికే తిరుపతి గ్రేటర్ ప్రతిపాదన గత కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఈ ఏడాది జనగణ మన ముగిసిన తర్వాతే తిరుపతి గ్రేటర్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని రాష్ట్రప్రభుత్వం వారికి ప్రకటించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చిత్తూరు కార్పొరేషన్ కూడా ఇంకా డివిజన్లను ఏర్పాటు చేసే పని కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం జరిగింది. డివిజన్లను పెంచుతూ త్వరలో అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్లో ఎలా విభజన చేయాలి ఏవిధంగా విస్తరించాలని అంశంపై జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ రాజకీయ పార్టీ నేతలతో కూడా కమిషనర్ సమావేశమై జనాభా ప్రకారం సర్వే నిర్వహించిన తర్వాతే డివిజన్లో ప్రకటిస్తారు.

Previous article
Next article

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు