చంద్రగిరి
చంద్రగిరి మండలం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలో మంగళవారం సాయంత్రం రెండు హల్చల్గ చేశాయి సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు గజరాజులు భాకరాపేట ఘాట్ రోడ్డుపైకి రావడంతో ఆ దారిలో వస్తున్నవాహనదారుడు ఏనుగులను చూశాడు దీంతో ఏనుగులు అతనిపై తిరగబడడంతో ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీశాడు అనంతరం సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్ళించడం ప్రయత్నం చేశారు దీంతో ఒక ఏనుగు మాత్రం భీమవరం అడవుల్లోకి వెళ్లిపోవడంతో మరో ఏనుగు అక్కడే తిష్టవేసింది ఒంటరి ఏనుగు రోడ్డుపై హల్చల్ చేస్తుండడంతో దారిలో వెళ్తున్న వాహదారులు భయాందోళనకు గురి అయ్యారు రాత్రి 9 గంటల సమయంలో భాకరాపేట రంగంపేట రెండు చోట్ల ఉన్న అటవీ చెక్పోస్టులను మూసివేశారు తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిని మూసివేసి వాహన రాకపోకలను నిలిపివేశారు అటవీశాఖ అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి వెళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు
