పట్ట పగలే పొలాల్లోనే ఏనుగుల తిష్ట

పట్ట పగలే పొలాల్లోనే ఏనుగుల తిష్ట
కూచివారిపల్లి రైతుల బేజారు

చంద్రగిరి చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామ రైతులు గజరాజుల ధాటికి విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద గ్రామంలోని పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. సాధారణంగా రాత్రి వేళల్లో వచ్చే ఏనుగులు, ఇప్పుడు ఏకంగా పట్టపగలే పొలాల్లో తిష్టవేస్తుండటంతో రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
పంటలు ధ్వంసం.. సాగునీటి పైపులు నాశనం గ్రామంలోని మామిడి తోటలు, ఇతర పంటలను ఏనుగులు తొక్కి వేయడమే కాకుండా, చెట్ల కొమ్మలను విరిచివేసి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగులు పొలాల్లో ఏర్పాటు చేసుకున్న సాగునీటి పైపులను, మోటార్లను సైతం ధ్వంసం చేస్తున్నాపట్ట పగలే పొలాల్లోనే ఏనుగుల తిష్ట
కూచివారిపల్లి రైతుల బేజారు

చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామ రైతులు గజరాజుల ధాటికి విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద గ్రామంలోని పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. సాధారణంగా రాత్రి వేళల్లో వచ్చే ఏనుగులు, ఇప్పుడు ఏకంగా పట్టపగలే పొలాల్లో తిష్టవేస్తుండటంతో రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
పంటలు ధ్వంసం.. సాగునీటి పైపులు నాశనం గ్రామంలోని మామిడి తోటలు, ఇతర పంటలను ఏనుగులు తొక్కి వేయడమే కాకుండా, చెట్ల కొమ్మలను విరిచివేసి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగులు పొలాల్లో ఏర్పాటు చేసుకున్న సాగునీటి పైపులను, మోటార్లను సైతం ధ్వంసం చేస్తున్నాయి. కళ్లముందే పంట నాశనమవుతున్నా, గజరాజుల గుంపును చూసి రైతులు పొలాల్లోకి వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.

భయాందోళనలో రైతాంగం:

“పగలు కూడా ఏనుగులు పొలాల వదలడం లేదు. పని చేసుకోవడానికి వెళ్లాలంటే భయమేస్తోంది. పెట్టుబడి కూడా తిరిగి వచ్చేలా లేదు” అని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో అటు వ్యవసాయ పనులు నిలిచిపోవడమే కాకుండా, అటుగా వెళ్లే బాటసారులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖాధికారులు స్పందించాలి వరుసగా జరుగుతున్న ఈ దాడులపై అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూసి న్యాయం చేయాలని కోరుతున్నారు.
యి. కళ్లముందే పంట నాశనమవుతున్నా, గజరాజుల గుంపును చూసి రైతులు పొలాల్లోకి వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.

భయాందోళనలో రైతాంగం:

“పగలు కూడా ఏనుగులు పొలాల వదలడం లేదు. పని చేసుకోవడానికి వెళ్లాలంటే భయమేస్తోంది. పెట్టుబడి కూడా తిరిగి వచ్చేలా లేదు” అని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో అటు వ్యవసాయ పనులు నిలిచిపోవడమే కాకుండా, అటుగా వెళ్లే బాటసారులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖాధికారులు స్పందించాలి వరుసగా జరుగుతున్న ఈ దాడులపై అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Previous article
Next article

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు