తనదాకా వస్తే..!

తనదాకా వస్తే..!
పూర్వం కిరణ్మాయారణ్యంలో ఓ తాగునీటి కొలను వుండేది.  ఆ కొలనులో అటవీ జంతవులులన్నీ నీటి దాహం తీర్చుకునేవి.
ఓ రోజు అడవికి పెద్ద సింహం వచ్చింది. బాగా ఆకలిగా వున్న అది జంతువుల కోసం ఎదురు చూడసాగింది.
ఉన్నట్లుండి దానికి పెద్ద శబ్దం విన్పించింది. వెనుదిరిగి చూసే సరికి  వెనుక ఏనుగు మడుగులో గిలగిలా కొట్టుకు ఫీుంకరిస్తోంది.  దాన్ని చూసిన సింహం గుండె ఆగినంత పనైంది.  ఇంకా నయం.. కొలను మధ్యలో ఓ రాయిపై పడుకున్న జింకను పట్టుకోవాలనుకుంది.  మనసు అంగీకరించక  కొలనులో దిగలేదు.  దిగి వుంటే  పెద్ద ప్రమాదానికి గురయ్యేది.
అంతలో వెనుతిరిగి చూసింది.  ధబ్‌ మన్న పెద్ద బండ రాయి మీద పడినంతపనైంది.  అది తప్పించుకుని  దూరంగా వెళ్లింది.
కొలనులో మొసలి నోట్లో చిక్కుకున్న ఏనుగు అరుస్తున్న అరుపుతో అడవంతా దద్దరిల్లింది.  క్షణాల్లో అడవి జంతువులన్నీ కొలను వద్దకు చేరుకున్నాయి.  ఆపదలో చిక్కుకున్న ఏనుగును చూసి అది రక్షించేందుకు ఉపాయం వెతికాయి.
కొండ మీదికి వెళ్లి పెద్ద బండరాయిని నీళ్లలోకి తోశాయి.  దబ్‌ మంటూ పడిన శబ్దానికి మొసలి పట్టు వీడిరది. దీంతో ఏనుగు స్వేచ్ఛగా ముందుకు కదిలింది. బాగా గాయం కావడంతో  ముందుకు నడవలేకపోయింది.
అక్కడే వున్న కుందేలు వద్దకు తీసుకెళ్లాయి.
ఏనుగు గాయాన్ని పరీక్షించిన కుందేలు ఏదో పసురు పూసింది.  బాగా కోలుకుని ముందుకు నడిచింది ఏనుగు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుకుని వాటికి రక్షణగా నిలిచింది.
ఏనుగు పరిరక్షణలో ముందుకు సాగుతున్న అడవి జంతువులను తినాలన్న సింహానికి వీలు కాలేదు.  జిహ్వ చాలప్యం చావలేదు. ఎదురుచూడసాగింది.
ఓ రోజు కుందేలు ఒంటరిగా వుండటం చూసి దాని పిల్లలతో సహా నోట కరచుకుకుంది.
ఏనుగు పరిరక్షణలో వున్న  జంతువుల్లో ఓ రోజు ఏనుగు పిల్లకి జ్వరం వచ్చి డాక్టరు కుందేలు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ కుందేలు కనిపించలేదు. ఏనుగు పిల్లకు జ్వరం ఎక్కువై చనిపోయింది.  మరి కొన్ని రోజులకు కొన్ని జంతువులు జబ్బుతో అల్లాడి కుందేలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆందోళనలో పడ్డాయి. ఇది చూసి తన నోటికి చిక్కకుండా అన్యాయం చేసినందుకు  వాటికి రక్షణ కల్పిస్తున్న ఏనుగుకు తగిన శాస్తి జరిగిందిలే అని సంబర పడింది. సింహం.
ఓ రోజు సింహం పిల్ల తీవ్ర జ్వరం వచ్చి బాధపడసాగింది.  కుందేలు గుర్తుకు వచ్చి వైద్యం కోసం తన పిల్లను వెంటబెట్టుకుని వెళ్లింది. అయితే కుందేలు అప్పటికే తన జిహ్వ చాపల్యానికి బలైందని గ్రహించి తనలో తానే నిందించుకుంది.  చూస్తున్నంతలో తన పిల్ల సింహం జ్వరం ఎక్కువై ప్రాణం విడిచింది. తను చేసిన తప్పుకు కుందేలు వైద్యం అందక తన బిడ్డను కళ్ల ముందే పోగొట్టుకుని కుమిలిపోసాగింది.  తను చేసిన తప్పు ఏమిటో తెలిసి వచ్చింది.  ఇక అప్పటి నుంచి పరులకు బాధ కలిగించే పనిని చేయడం మానుకుంది సింహం.
` బోగా పురుషోత్తం, తుంబూరు.

Previous article
Next article

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు